జగిత్యాల,(సిరా న్యూస్);
కాంగ్రెస్ పాలనలో రైతుల నుంచి భూ సిస్తూ, నీటి పన్ను వసూలు చేశారని తెలంగాణ పాలనలో 24 గంటల కరెంట్ సాగునీటిని ఇచ్చిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలంలోని తాటిపెల్లి, మోరపెల్లి, చల్‌గల్, చర్లపెల్లి, హస్నాబాద్ గ్రామాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకంటె ముందు హైద్రాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించిందని, అటువంటి పరిస్థితి నుండి నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నంపెట్టే రాష్ట్రంగా ఎదగడానికి కారణం సీఎం కేసీఆర్ చలవే అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు సరఫరా, చెరువులకు పూర్వవైభవం తీసుకురావడంతో భూగర్భ జలమట్టం పెరుగడం, ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరా చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నేడు భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయన్నారు. వరి కోతల సమయం కావడంతో ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనపడుతున్నాయన్నారు. తాటిపెల్లి వద్ద ఎస్సారెస్పీ కాలువకు మోటర్లు పెట్టుకొని పంటలకు నీరు పెట్టుకుంటుంటే అధికారులు కరంటు కట్ చేశారని, కరంటు పునరుద్దరించాలంటూ మీతో పాటు నేను కూడా రోడ్డుపై బైఠాయించానని, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెల్లడంతో రైతులు రాష్ట్రంలోని ఏ కాలువకు మోటర్లు పెట్టుకున్నా కరంటు కట్ చేయవద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. గతంలో కాంగ్రెస్, బీజేపీల పాలనను చూసిండ్రు…వాల్ల పాలనలో వ్యవసాయానికి కరంటు ఎట్టించ్చిండ్రో కూడా చూసిండ్రు…ఎన్ని కష్టాలు పడ్డరో గుర్తుంచుకోవాలని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయానికి కరంటు ఎట్లిస్తున్నరనే విషయాన్ని పరిశీలించాలన్నారు.