మెట్రో చాట్ విత్ మధు యాష్కీ గౌడ్…

హైదరాబాద్, (సిరా న్యూస్);

టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ వినూత్న ప్రచారానికి తెర లేపారు.. సాధారణ ప్రజల్లో ఒకడిగా కలిసిపోయి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుండి ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో మాట్లాడుతూ వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు.  ముఖ్యంగా ఐటి ప్రొఫెషనల్స్ మరియు ఇతర ఉద్యోగులతో మాట్లాడారు. మెట్రో ప్రాజెక్టు 2008లో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రారంభించింది. నేడు నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజనరీ పార్టీ. ఏ ప్రాజెక్టు రూపొందించిన భవిష్యత్ తరాలకు బ్రహ్మాండంగా ఉపయోగపడేలా కలకాలం నిలిచేలా ఉంటుంది. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టిన రెండేళ్లకి ప్రమాద దశకు చేరింది. జవహర్ లాల్ నెహ్రూ హయాంలో కాంగ్రెస్ కట్టిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పటికి చెక్కుచెదరలేదని అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధత అని పేర్కొన్నారు.
కెసిఆర్ ప్రభుత్వం ప్రజా ధనం విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ, కమిషన్లు కాంట్రాక్టులు అంటూ తెలంగాణలో విధ్వంసం సృష్టించారు. భవిష్యత్తు తరాల నిధిని కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒకటేనని. ప్రజలు విశ్వాసముంచి మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *