సిరా న్యూస్, దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం లోని దమ్మపేట మండలం లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. నేను బయట అయితే మాట్లాడతాను కాని నన్ను పెంచిన వాళ్ళ ముందు మాట్లాడాలి అంటే కొంచెం కష్టమే. టిడిపి జెండా జన్మనిచ్చింది. పామ్ ఆయిల్ మొక్క నాటింది మొదటిగా ఎన్టీ రామారావే. నన్ను మొదటి సరిగా నాకు అవకాశం ఇచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. రాష్ట్రము విడిపోయినప్పుడే అనుకున్నాం మనకు ఈ పరిస్థితి వస్తుందని. 5 మండలాల ప్రజలు ప్రతి మండలానికి నేను అభివృద్ధి చేసాను. మేము శత్రువులం కాదు ప్రత్యర్థులం మాత్రమే అందుకే గ్రామ స్థాయి కార్యకర్త నుండి అందరు నన్ను పొంగులేటిని కాంగ్రెస్ పార్టీ లోకి రమ్మని ఆహ్వానించారని అన్నారు. 40 సంవత్సరాలుగా మేమిద్దరం ఎలా అభివృద్ధి చేసామో అలాగే అభివృద్ధి చేస్తాం. ఏ గ్రామానికి ఏమి కావాలో మీకన్నా మాకే ఎక్కువ తెలుసు. మేము మీ మనుషులం ఇన్ని రోజులు రాజకీయాల్లో బ్రతికి ఉన్నాం ఆంటే కేవలం మీ వల్లే. మమ్మల్ని ఎలా ఆధారించారో అలాగే జారే ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. పామ్ ఆయిల్ రేటు కాని నర్సరీ లకు ఉన్న సమస్యలు కాని రాహుల్ గాంధీ తో మాట్లాడి అన్ని సమస్యలు తీరుస్తా అని మాటిస్తున్నా. ఇందిరా గాంధీ తుపాకీ తూటలకు బలి అయ్యారు రాజీవ్ గాంధీ బాంబు దాడిలో బలి అయ్యారు. టక్కు టమారా విద్యలు చుపె వారికి దూరంగా ఉండాలీ. రాహుల్ కి ప్రధానమంత్రి గా అవకాశం వచ్చిన తీసుకోకుండా వేరే వారికి ఇచ్చారు. మేము ఎప్పటికి శత్రువులం కాదు కేవలం ప్రత్యర్థులం మాత్రమే. సత్తుపల్లి అశ్వారావుపేట నియోజలవర్గాలు అంటే మంచి మనసు తెలివి అన్నదమ్ముల వలే కలిసిమెలిసి ఉన్నాం. నియోజకవర్గానికి ఏ కష్టం వచ్చిన మేము ఇద్దరం ఉన్నాం జారే ని మీరు గెలిపించండి మిమ్మల్ని మేము చూసుకుంటాం. 40 సంవత్సరాలు నేను ఉప్పు కారం తినే వ్యక్తినే మీరు జారే ని గెలిపించండి మేమున్నాం. మీకోసం మీ అభివృద్ధి కోసం మేమున్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం లో పామాయిల్ రైతు తల ఎత్తుకు తిరిగేలా చేస్తా. అన్నీ పార్టీ లు ఇప్పుడు కాంగ్రెస్ తో జత కట్టాయి. భర్తను, అత్తను కోల్పోయినా కూడా వెనకడుగు వేయకుండా సోనియా నిలబడింది. రాష్ట్రాన్ని దోచుకునే వారిని తిప్పి కొడదామని అన్నారు