రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం

                                                                                 న్యూ డిల్లీ , (సిరా న్యూస్);
; అమెరికా నావికాదళానికి చెందిన ఓ భారీ విమానం రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన హవాయిలోని మెరైన్‌ కోర్‌ బేస్‌లో చోటు చేసుకుంది. సముద్రంలో బోటింగ్‌ చేస్తున్న వారు వెంటనే అప్రమత్తమై సహాయం చేయడంతో విమానంలోని సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అమెరికా నౌకాదళానికి చెందిన పీ-8ఏ పొసెడాన్‌ విమానం రన్‌వేపై అదుపుతప్పి హవాయి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో సముద్రంలో బోటింగ్‌ చేస్తున్న వారు విమానాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విమానంలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విజిబిలిటీ తక్కువగా ఉండటం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *