అనకాపల్లి,(సిరా న్యూస్);
జిల్లా కేంద్రంలో జరిగిన భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి పాల్గోన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశం రింగ్రోడ్ల గల పెంటకోట కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. రాష్ట్రంలో రైతులకు ప్రతి ఆరు నెలలకు 6000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఆమె తెలిపారు.
ఈ 6000 రూపాయలతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వo 6000 రూపాయలు కలిపి 12000 ఇస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. వైయస్సార్ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో మూడు సుగర్ ఫ్యాక్టరీలకను తిరిపిస్తానని తెలిపి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ షుగర్ ఫ్యాక్టరీ కోసం పట్టించుకునే లేదు ఈ ప్రభుత్వం. జీవీఎంసీలో డంపింగ్ యార్డు నిర్వహించడంపై ఈ ప్రభుత్వనికి చిత్తశుద్ధి లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం విద్వాంసకాండ ప్రభుత్వంగా నిలిచిందని అన్నారు. ఈ వైయస్సార్ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి హింసిస్తున్నారు.