తిరుపతి,(సిరా న్యూస్);
ప్రధాని పర్యటన నేపధ్యంలో బందోబస్తుకు వచ్చిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ (59) గుండెపోటుతో తిరుమల శ్రీవారి నడకదారిలో మృతి చెందారు. మెట్ల మార్గంలో 1,805 మెట్టు వద్ద గుండెపోటుకుగురైన కృపాకర్ ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం అయన తిరుమలకు వచ్చారు. కృపాకర్ కృపాకర్ స్వస్థలం విజయవాడసమీపంలోని పోరంకి. పోలీసులు ఘటనపై కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.