సిరా న్యూస్, పిఠాపురం
ఆడుదాం ఆంధ్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దొరబాబు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు శుక్రవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు అంచెలుగా నిర్వహించే పోటీలలో ప్రతిఒక్క క్రీడాకారుడూ పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు మంచి భవిష్యత్తును కల్పించాలన్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గ్రామీణప్రాంత క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకుంటే అందుకు తగిన క్రీడా సామగ్రిని కూడా పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో సరదాగా ఆడుకునే …కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ ఆటలను ప్రధానంగా ఇందులో పొందుపరచడం జరిగిందన్నారు. ఈ అనుభం ఉన్న క్రీడాకారులు పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.