సిరా న్యూస్, ఆదిలాబాద్:
దిశ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి…
– న్యాయవాది శ్రవణ్ నాయక్
2019లో సంచలనం సృష్టించిన దిశ గ్యాంగ్ రేప్, మర్డర్ కేసులో బాదితురాలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రముఖ న్యాయవాది శ్రవణ్ నాయక్ కోరారు. ఈ మేరకు ఆయన మహాత్మ జ్యోతి రావ్ ఫులే ప్రజా భవన్లో బాదితురాలి తండ్రితో కలిసి మంత్రి సీతక్కకు విన్నవించారు. 2019 నుంచి ఇప్పటి వరకు బాదితురాలి కుటుంబీకులకు పరిహారం అందలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం అందించడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని వాపోయారు. గతంలో హైదరబాద్ కలెక్టర్కు వినతి పత్రం అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని, ప్రభుత్వం వెంటనే బా«ధిత కుటుంబ సభ్యులకు రూ. 1 కోటి పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.