సిరా న్యూస్, అదిలాబాద్(బేల):
తనకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఆదిలాబాద్ అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ అదిలాబాద్ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనకు డప్పు వాయిద్యాలు, మంగళ హారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆడపడుచులు తిలకం దిద్ది ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే అన్ని రంగాల్లోఅభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అమలు చేసేటటువంటి ఆరు గ్యారెంటీ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని అన్నారు. భూమిలేని నిరుపేద ప్రజలకు ప్రతి ఏటా 12 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పైజుల్లా ఖాన్, మాజీ జెడ్పిటిసి రాందాస్ నాక్లే, మార్కెట్ కమటీ చైర్మన్ వామన్, మాజీ సర్పంచ్ రూపురావు, గ్రామ ప్రజలు, ఇక నాయకులు పాల్గొన్నారు.