సిరా న్యూస్, అదిలాబాద్:
అదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండలంలోని పలు గ్రామాల యువకులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరారు. ఆదిలాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు బిఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే జోగు రామన్న యువకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోనే కల్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత కరెంట్, అమ్మఒడి, వంటి ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. ఎన్నికల్లో ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ గోవర్ధన్, జడ్పిటిసి తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, తదితరులు ఉన్నారు.