గ్రంథాలయ వారోత్సవాల ముగింపు, (సిరా న్యూస్);
బద్వేలు
యన్.జి.ఒ హోం నందు సోమవారం 56 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు ఉత్సవ కార్యక్రమం లైబ్రేరియన్ వి.లక్ష్మిదేవి ఆధ్వర్యాన ఘనంగా జరిగినది.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ సాధన సమితి ఛైర్మెన్ బద్వేలు గురుమూర్తి సభ నిర్వహణ వహించగా ముఖ్య అతిథులు గా యోగివేమన యూనివర్శిటీ కౌన్సిల్ సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు,34 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి పి.ఉమ, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటసుబ్బారెడ్డి, రిటైర్డ్ డిప్యూటి సివిల్ సర్జన్ డా.మీనాక్షి రెడ్డి, మొల్ల సాహితీపీఠం అధ్యక్షులు విద్వాన్ గానుగపెంట హనుమంతరావు,ఆవాజ్ కమిటీ అధ్యక్షులు యస్.ఎ. సత్తార్ హాజరై మొదటగా జాతీయ గ్రంథాలయ ఫౌండర్ యస్.ఆర్ రంగనాథన్, రాష్ట్ర పబ్లిక్ గ్రంథాలయాల వ్యవస్థాపకులు అద్దంకి వెంకటరమణయ్య గార్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కొండపల్లి చిన్న సుబ్బారావు మాట్లాడుతూ గ్రంథాలయాలు వ్యక్తిని
మేధోశక్తి గా మార్చి సమాజానికి దేశ అభ్యుదయానికి.. అభివ్రృద్దికి మూల స్తంభాలు అన్నారు.బద్వేలు గ్రంథాలయానికి తన సహాయంగా రక్షిత వాటర్ ఫిల్టర్ ను అందిస్తానన్నారు. అలాగే గ్రంథాలయ శాశ్వత భవనం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బద్వేల్ గ్రంథాలయానికి శాశ్వత భవనం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రధానోపాధ్యాయులు వెంకటసుబ్బా రెడ్డి ప్రసంగిస్తూ గ్రంథాలయాలలో చదివిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ అబ్దుల్ కలాం లాంటి ఎందరో మహనీయులు ప్రపంచ మేధావులుగా గుర్తింపు పొందారు. కావున గ్రంథాలయాల ప్రాముఖ్యత చాలా గొప్పది అన్నారు. గానుగపెంట హనుమంతరావు ప్రసంగిస్తూ ఆయా దేవాలయల్లో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే వెళ్లి భక్తి జ్ఞానాన్ని నేర్చుకొంటారు. కానీ గ్రంథాలయాల్లో అందరూ పుస్తక పఠనం చేసి జ్ఞాన సముపార్జన చేసుకుంటారు. గ్రంథాలయాలు జ్ఞాన నిలయాలు అన్నారు.అనంతరం ముఖ్య అతిథులు పదిమందికి దుశ్శాలువా పూలమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత షేక్ మహబూబ్ సాహెబ్
,లెక్చరర్ రవి,మహిళా స్పోక్స్ పర్సన్ పి.కృష్ణవేణి, పెన్షనర్ల సంఘం కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య,కోశాధికారి గంగయ్య, మరియు యు.రమణయ్య, డి.వై.యఫ్.ఐ కార్యదర్శి జి.నాగార్జున, అన్వర్ భాష,మహీర్, డి.బి.యఫ్ రాష్ట్ర నాయకులు చిన్నయ్య,విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. సభను జయప్రదం చేసిన అందరికీ లైబ్రేరియన్ లక్ష్మీదేవి కృతజ్ఞతలు తెలియచేశారు.