-జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే యువతకు భవిషత్తు… ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి..
సిరా న్యూస్, నంద్యాల జిల్లా ;
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే భవిషత్తు ఉందని.. ప్రధానంగా యువతకు న్యాయం జరుగుతుందని భావించిన నంద్యాల పట్టణం శుక్రవారం రోజున వైఎస్సార్ నగర్, నందమూరినగర్ ప్రాంతాలలోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన యువత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై అలాగే టీడీపీ నాయకుల నిర్లక్ష్యానికి గురికాబడిన వారు కేవలం జగనన్న, శిల్పాకుటుంబంతోనే తమకు న్యాయం జరుగుతుందని వైఎస్సార్సీపీలోకి చేరడం సంతోషంగా ఉందని నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్యే ఆద్వర్యంలో నాగరాజునాయక్, దీపక్ నాయక్ ఆద్వర్యంలో వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, మహిళలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికి ఎమ్మెల్యే కండువాలు కప్పి స్వాగతం పలికారు. పార్టీ భలోపేతానికి కృషిచేయాలని వారిని ఎమ్మెల్యే కోరారు.