సిరా న్యూస్,నల్గోండ;
లోకసభ ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు జాతీయ ఓబీసీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్. నల్లగొండలోని బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 10 లోకసభ స్థానాలు, 30 శాతం ఓట్లే బిజెపి లక్ష్యం అని ఆయన అన్నారు. తెలంగాణ లో బీఆర్ఎస్ కనుమరుగయ్యే పార్టీ అని,కాంగ్రెస్ అమలు చేయలేని హామీలను ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే తెలిపోయిందని డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవ చేశారు, అప్పులు లేకుండా సుభిక్ష పాలన అందించాలంటే అది కేవలం బిజేపి పార్టీకి డబుల్ ఇంజన్ సర్కారుకు మాత్రమే సాధ్యమని ఆయన గుర్తుచేశారు,కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ, గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు డాక్టర్ లక్ష్మణ్ సూచించారు.