అభివృద్ధిలో రాజకీయాలు ఉండకూడదు.

ప్రజా సేవకుల పనిచేయాలి.

ఎమ్మెల్యే పాయల్ శంకర్
సిరా న్యూస్,అదిలాబాద్;
ఎన్నికల వరకే రాజకీయ నాయకులు గెలిచిన తరువాత ప్రజా ప్రతినిధులు. ఎవ్వరైనా సరే ప్రజల మేలుకోసం పనిచేయాలి లేదంటే వారికి పుట్టగతులుండవు అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ . రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పాయల్ శంకర్ ద్వారక నగర్ కూలిపుర కాలనీల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పథకాలు ప్రవేశ పెడుతుంది. ఈ పథకాలను అర్హులైన ప్రజలందరికీ అందేలా చూస్తానని అన్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం మాత్రమే రాజకీయాలు, గెలిచిన తరువాత ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం పని చేస్తారు. శంకరన్న మీ అందరివాడు మీకు ఏ సమస్య ఉన్న నన్ను నేరుగా సంప్రదించండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ . అధికారులు జిల్లా నాయకులు కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్ .లాలామున్న . కృష్ణ యాదవ్. జోగు శైలజా రవి. పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *