సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పాడు సర్వే నంబర్ 131 లో ఉన్న భూమిపై నకిలీ డాక్యుమెంట్లతో 50 కోట్ల రుణం తీసుకున్న వైనం బయటపడింది. ఈ కేసులు వసుంధర ఇంటిగ్రేటెడ్ సాటిలైట్ టౌన్ షిప్ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చెందిన నిందితులు,రావి చక్రధర్, శ్రీనివాసరావులపై తాసిల్దార్ సునీత ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. నకిలీ పత్రాలు సృష్టించారని తాసిల్దార్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్ఆరు. నిందితులు బ్యాంకు లోన్ కోసం ముంబైలోని ది సిండికేట్ ఫైనాన్స్ బ్యాంకులో అప్లై చేసారు.