మేడారం జాతర లో ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాప్స్ సమ్మేళం

– జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

– మేడారం లో పర్యటించిన టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్

సిరా న్యూస్,ములుగు;
మేడారం జాతరలో ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాప్స్ సమ్మేళం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.శుక్రవారం కేంద్ర పర్యాటక, సంస్కృతి అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ అరుణ్ కుమార్ , జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి మేడారం లోని ట్రైబల్ మ్యూజియం, హరిత హోటల్ ను సందర్శించారు.మేడారం లో జరగబోయే శ్రీ సమ్మక్క సారమ్మ జాతరలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాప్స్ సమ్మేళం చేసి వాటి ప్రదర్శన చేయడం జరుగుతుందని టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ
డైరెక్టర్ అరుణ్ తెలిపారు. జాతర సమయంలో దేశవ్యాప్తంగా 20 మంది ట్రైబల్ కళాకారులు సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి వాటిని అమ్మకాలకు పెట్టడం జరుగుతుందని తెలిపారు.సెంట్రల్ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో థీమ్ ఫెవిలియం ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయ సంస్కృతుల కళాఖండాలను ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు.ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం జాతరలో ఏర్పాటు చేయబోయే గిరిజన కళాకృత సమ్మేళనానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గిరిజన కళాకారుల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.అనంతరం టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అరుణ్ వనదేవతలను దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఎండోమెంట్ నిర్వహణ అధికారి రాజేందర్, ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వసంతరావు, డిపిఓ వెంకయ్య, ఐటిడిఏ ఎస్ ఓ రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *