ఖానాపూర్, సిరా న్యూస్
ఖానాపూర్ లో ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శివాజీ నగర్ రోడ్డుపై గురువారం మధ్యాహ్నం పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఖానాపూర్ కు చెందిన అలేఖ్య పెళ్లికి నిరాకరించిందని ఆగ్రహంతో ప్రియుడు శ్రీకాంత్ ఆమెపై గొడ్డలితో అతి దారుణంగా దాడి చేశాడు. దీంతో ఆమె రక్తం మడుగులో అక్కడికక్కడే మృతి చెందింది. యువతిపై దాడి చేసే సమయంలో అడ్డుగా వచ్చిన మరో ఇద్దరిపై కూడా దాడి చేయడంతో వారికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారికి వెంటనే ఖానాపూర్ 108 లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన యువతి సమీపంలోని టైలరింగ్ కు వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. నిందితుడు ఉదయం నుంచే అక్కడ కాపు కాసినట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని ఖానాపూర్ పోలీసులు పరిశీలించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.