సిరాన్యూస్, చిగురుమామిడి
క్రమశిక్షణ యుతమైన జీవితాన్నిగడపాలి
* పాఠశాల ప్రిన్సిపాల్ అప్పాల సమ్మయ్య
* ఆక్స్ఫర్డ్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
క్రమశిక్షణ యుతమైన జీవితాన్నిగడపాలని పాఠశాల ప్రిన్సిపాల్ అప్పాల సమ్మయ్య అన్నారు. బుధవారం చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామం లోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలు అనేక రకాల వర్కింగ్ మోడల్స్. చంద్రయాన్ రాకెట్ ప్రయోగం, సౌర కుటుంబం, కాలుష్య రకాలు వాటిని తగ్గించే పద్ధతులు, మానవ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ, మొదలైన ప్రాజెక్టులు తయారుచేసి అవి పని చేసే విధానాన్ని మిగతా పిల్లలకు వివరించారు. మనిషి జీవితంలో సైన్స్ యొక్క ఆవశ్యకతను గొప్పతనాన్ని సైన్స్ కోసం మన సైంటిస్టులు చేసిన కృషిని పిల్లలు వారి ఉపన్యాసంలో వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అప్పాల సమ్మయ్య మాట్లాడుతూ పిల్లలు తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను నిత్యజీవితంలో వినియోగించుకొని క్రమశిక్షణ యుతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కూన సంపత్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.