సిరా న్యూస్, బేల
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
* మాజీ సర్పంచ్ అశోక్ టాక్రె
* సీసీ రోడ్డు పనులకు భూమి పూజ
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్య మని మాజీ సర్పంచ్ అశోక్ టాక్రె అన్నారు. గురువారం అదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బేదోడా గ్రామంలో ఆరు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు స్థానిక మాజీ సర్పంచ్ అశోక్ టాక్రె మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగ అశోక్ టాక్రె మాట్లాడుతూ మండలంలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేయడం పట్ల జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క , ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాలు మరింతగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకోస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రజాప్రభుత్వం గత ఎన్నికలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేవిదంగా ముందుకు వెళ్తుందని అన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరు మీద కేవలం కాలయాపన చేశారు తప్ప అభివృద్ధి ఎక్కడ చేయలేదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో మండలానికి మరింతగా నిధులు మంజూరు చేసి గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే,మండల మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాన్షమ్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మాడవి చంద్రకాంత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్, బొక్రె శంకర్, తదితరులు పాల్గొన్నారు.