సిరా న్యూస్, ఆదిలాబాద్:
11 న రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం…
రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈనెల 11 న సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈనెల 11 న సాయంత్రం 4 గంటలకు పండగ ఏర్పాట్ల గురించి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారులు, ముస్లిం మత పెద్దలు ఈ సమీక్ష సమావేశానికి హాజరుకావాలని కలెక్టర్ కోరారు.