ఉద్యమాల ద్రోహికి తగిన గుణపాఠం చెప్పండి

బిసిలకు, ఎస్సీలకు, మహిళలకు, జర్నలిస్టులకు అన్యాయం చేసిన డా.సంజయ్ కుమార్
యావర్ రోడ్డు విస్తరణలో అన్నీ అక్రమాలే
పాత్రికేయుల సంక్షేమం మరిచి సొంత పార్టీకి “గడి నిర్మించుకున్న” దొర
ఉచిత కంటి ఆపరేషన్ల కు ఆధార్ కార్డు లెందుకు..?
సిరా న్యూస్,జగిత్యాల;
తెలంగాణ ఉద్యమాల సమయంలో ఎక్కడా కానరాని
ఉద్యమాల ద్రోహి డాక్టర్ సంజయ్ కుమార్ కు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఉద్యమ కారుడు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళ వారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు.  ఎంతో మంది ప్రాణాలు అర్పించి, సకల జనులు రోడ్డెక్కిన తెలంగాణ ఉద్యమాలలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఏనాడూ కనిపించిన దాఖలాలు లేవన్నారు. అంతే కాకుండా భారత రాజ్యాంగ పరంగా కల్పించబడిన  మహిళల, ఎస్సీల, బిసి ల, జర్నలిస్టుల హక్కుల ను కూడా కాలరాసి వారికి కూడా తీరని అన్యాయం చేసిన నమ్మక ద్రోహి ఈ డా.సంజయ్ కుమార్ అని ప్రకటనలో చుక్క గంగారెడ్డి మండి పడ్డారు. జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న బిసి మహిళ డా. బోగ శ్రావణి రాజీనామా చేస్తే ఆ సీటును నేటి వరకు నియమించకుండా బిసి మహిళ లకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. బండారి రజినీ అనే కౌన్సిలర్ కు మున్సిపల్ చైర్ పర్సన్ పదవి దక్కుతుందని ఆశతో అహర్నిశలు కృషి చేసిన బండారి నరేందర్ చివరకు పార్టీ కార్యక్రమాల లోనే ప్రాణాలు పోగొట్టుకున్నా ఆ కుటుంబాన్ని, ఆ కౌన్సిలర్ ను గుర్తించక పోవడం, చైర్ పర్సన్ పదవి ఇవ్వక పోవడం బాధాకరం అని సూచించారు. బిసి మహిళ కు చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ని ఒక “ఓసి పురుషునికి” కట్టబెట్టడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. జగిత్యాల రూరల్ ఎంపిపి గాజుల గంగారాం గౌడ్ చనిపోయి రెండున్నర ఏండ్లు గడుస్తున్నా ఆ స్థానంలో ఎన్నికలు నిర్వహించక పోవడం, ఆ ఎంపిపి స్థానాన్ని కూడా మరో “ఓసి పురుషునికి” కట్టబెట్టడం ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. అలాగే జగిత్యాల అర్బన్ ఎంపిపి ఎస్సీ మహిళ దురదృష్ట వశాత్తు మరణించి రెండేండ్లు అయినా ఆ స్థానాన్ని నేటికీ భర్తీ చేయకపోవడం ఈ దొర అహంకారానికి నిదర్శనం కాదా అన్నారు. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తన వైద్యం  పేరుతో చేస్తున్న ఉచిత కంటి ఆపరేషన్ల కు ఆధార్ కార్డు జిరాక్స్ లు ఎందుకు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. అందులో గల మతలబ్ ఏమిటో ప్రజలకు తెలియ జెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *