Rajarshi Shah: తాగునీటి ఎద్ద‌డి త‌లెత్త‌కుండా ముందస్తు చ‌ర్య‌లు:  క‌లెక్ట‌ర్ రాజర్షి షా

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
తాగునీటి ఎద్ద‌డి త‌లెత్త‌కుండా ముందస్తు చ‌ర్య‌లు:  క‌లెక్ట‌ర్ రాజర్షి షా
* మౌళిక సదుపాయాల అంచనాలను పూర్తి చేయాలి
* టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారుల‌కు దిశా నిర్దేశం

అమ్మ ఆదర్శ- పాఠశాల కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సదుపాయాల అంచనాలను త్వరగా పూర్తి చేయాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా కుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదిలాబాద్‌ జిల్లా పాలనాధికారి రాజర్షి షా అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఈ నెల 4, 5 తేదీల్లో పాఠశాలల్లోని 5 రకాల పనులకు సంబంధించి వాటి యొక్క పనుల అంచనాలను సంబంధిత ఇంజనీర్స్ , హెడ్ మాస్టర్, వీఓల సమన్వయము తో పుర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 6న మండల స్థాయిలో ఎంపీడీ, ఏపీఓ, ఎంఈఓ, ఏపీఎం, ఏఏపీసీ చైర్మన్ లతో వర్క్ షాప్ నిర్వహించి ఈ నివేదికను సమర్పించాలని ఈసీఓ ను ఆదేశించారు. అలాగే తాగునీటి ఎద్దడి కోసం సమ్మర్ ప్లాన్ తయారు చేయాలని, దీనికి సంబందించి ప్రత్యేక అధికారిగా ఐటిడిఏ పిఓ ఖుష్బూ గుప్తా ను నియమించడం జరిగిందని, మండలం, మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. గ్రామపంచాయతీ అధికారులు వారికి సంబంధించిన గ్రామాలను తేదీల వారీగా ఒక్కొక్క గ్రామానికి వెళ్లి తాగునీటి సమస్యని పరిష్కరించాలని,. వారికి కేటాయించిన గ్రామాలను తప్పనిసరిగా వారానికి మూడుసార్లు పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాలలో ఎవరైనా సంబంధిత అధికారులు పనిచేయడం లేదని నా దృష్టికి వస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సమస్యలు ఉన్న హ్యాబి టేషన్ లో వాటర్ కు సంబంధించి మిషన్ భగీరథ వాటర్. బోర్ వెల్, చేతి పంపు, తదితర వాటి అంచనాలను తయారు చేసి నివేదిక సమర్పించాలని . ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని, మోటరు ద్వారా నీటిని సరఫరా చేయాలనీ, ఏవైనా మంజూరుకు సంబంధించి అంచనాలు తయారు చేసి పాంపాలని, గ్రామాల్లో ప్రజలు ఎవరు కూడా బావి దగ్గరకు వెళ్లి నీరు తీసుకోకూడదని ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి నీరు సరఫరా చేయాలని దిశా నిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *