సిరాన్యూస్, సైదాపూర్
కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలి
* వెన్నంపల్లి పీఏసీఎస్ సీఈఓ మల్లారెడ్డి
వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలని వెన్నంపల్లి పీఏసీఎస్ సీఈఓ మల్లారెడ్డి అన్నారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సీఈఓ మల్లారెడ్డి ప్రారంభించారు. ఏ గ్రేడ్ ధర వచ్చేసి రూ-2203, బి గ్రేడ్ ధర వచ్చేసి రూ-2183 లుగా నిర్ణయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.