సిరా న్యూస్,విశాఖపట్టణం;
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే జరిగింది. కాంగ్రెస్ అధికార పగ్గాలు అందేసుకుంది. హస్తం చేతిలోకి తెలంగాణ రాష్ట్రం చేరిపోయింది. తెలంగాణ ఎన్నికలు బీజేపీ ఒకరకమైన పాఠం నేర్పిస్తే.. అధికార బీఆర్ఎస్ కు అసలైన ప్రజానాడిని పరిచయం చేశాయి. ఇక తెలంగాణ రాజకీయాల్లో చెప్పుకోవాల్సిన ఒక పార్టీ ఈ ఎన్నికల్లో ఉంది. అది జనసేన. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. ఫాన్ ఫాలోయింగ్ ని ప్రజా స్పందనగా అంచనా వేసుకుని పదిహేనేళ్లుగా రాజకీయాలలో తలమునకలై ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టి పదేళ్లయినా.. ఏపీ రాజకీయాల్లో ఓట్లు.. సీట్ల పరంగా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన పవన్.. ఇప్పుడు అక్కడ తెలుగుదేశంకు నమ్మదగిన మిత్రుడిగా మారిపోయారు. అయితే, విచిత్రంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటే మండిపడే బీజేపీ అధిష్టానానికి ఇష్టుడిగా ముద్ర వేసుకున్నారు. ఇటు బీజేపీతోనూ దోస్తీ.. అటు టీడీపీతో పొత్తు అంటూ ఏపీలో కన్ఫ్యూజన్ రాజకీయాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగకుండానే చేతులెత్తేసిన సందర్భంలో.. నేనున్నాను అంటూ బీజేపీతో కల్సి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీకి దిగారు పవన్ కళ్యాణ్. పొత్తు ప్రతిపాదన ఈయనే చేశారో.. బీజేపీ కోరుకుందో కానీ.. అటూ ఇటూ చేసి 8 స్థానాలలో బీజేపీ పొత్తుతో పోటీ చేయడానికి రెడీ అయిపొయింది. ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ నిర్వహించిన బీజేపీ అతిపెద్ద బహిరంగ సభలో ఆయన పక్కన సీటు ఇచ్చారు. ప్రధాని కూడా పవన్ కళ్యాణ్ ని పొగిడి దగ్గర చేర్చుకున్నారు. తరువాత పవన్ కళ్యాణ్ స్వయంగా ఐదు నియోజక వర్గాల్లో కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక, వరంగల్, కూకట్ పల్లి లో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ, ఓటు వేసే సమయం వచ్చేసరికి అందరూ మొహం చాటేశారు. పవన్ కళ్యాణ్ చూడటానికి ఓకే కానీ.. ఓటుకు మాత్రం నో అని నిష్కర్షగా చెప్పేశారు. దీంతో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి జనసేన అభ్యర్థులది. సరే.. జనసేన గెలవలేదు.. మరి జనసేనపొత్తుతో బీజేపీకి ఏదైనా ఫలితం దక్కిందా అంటే అది కూడా ఏమీ కనిపించలేదు. ఇది పక్కన పెడితే.. అసలు జనసేన తెలంగాణలో ఎందుకు పోటీచేసింది? ఇది ఇప్పుడు పవన్ అభిమానులతో పాటు ఏపీ ప్రజలందరి మదినీ తొలిచేస్తున్న ప్రశ్న. పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా రాజకీయ పరిణితి ఇప్పటికీ సాధించలేదా? అనే ఆవేదన వారిది. జనసేన తెలంగాణలో పోటీచేస్తున్న సందర్భంలో గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లిలో గెలుస్తుంది అని అంచనా వేశారు. దానికి కారణాలు ఉన్నాయి. ఎక్కువగా అక్కడ సెటిలర్స్ ఉండడం