సిరాన్యూస్, చిగురుమామిడి
చిగురుమామిడి మండల పదో తరగతి టాపర్ గా దాసరి సిరి వైష్ణవ్య
* మండలంలో 94. 2% ఉత్తీర్ణత
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించిన పదో తరగతి ఫలితాల్లో చిగురుమామిడి మండల టాపర్ గా ముల్కనూరు మోడల్ స్కూల్ విద్యార్థిని దాసరి సిరి వైష్ణవ్య 10 జీపీ తో నిలిచారు.మండలంలో 94.2శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆరుగురు విద్యార్థులు 9.8 జిపిఏ సాధించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 277 మందికి గాను 261 మంది పాసయ్యారు.16 మంది ఫెయిలయ్యారు. సిరి వైష్ణవ్య ని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కొడిమ్యాల శ్రీనివాస్, మోడల్ స్కూల్ అధ్యాపకు బృందం అభినందించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత కూతురే సిరి వైష్ణవ్య. దాసరి ప్రవీణ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు తమ కుమార్తె 10జిపి సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సిరివైష్ణవ్య ని 10 GP సాధించడం పట్ల అభినందించారు.
విద్యార్థులకు ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.