గంగమ్మలకు సారె  సమర్పణ

సిరా న్యూస్;
ఏడు గంగల జాతరను పురస్కరించుకుని గంగమ్మలకు ముక్కంటి ఆలయం తరఫున శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత వాయు లింగేశ్వర స్వామి సారె  ను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది ఈ సందర్భంగా మంగళవారం ఏడు గంగలకు సమర్పించే సారె  తోపాటు  విశేష పూజ ద్రవ్యాలను ముక్కంటి ఆలయంలోని అలంకార మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు మేళ తాళాలతో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు , ఆలయ ఈవో రామారావు,   మునిసిపల్ కమిషనర్,  రమేష్ బాబు  తదితరులు శిరస్సుపై ఉంచుకు ని  భక్తి  శ్రద్ధలతో ముత్యాలమ్మ గుడి వీధిలోని ఏడు గంగల ఆలయంలో  సారె  సమర్పించారు. ఈ సందర్భంగా ఏడు గంగల  అమ్మవారిని, ముత్యాలమ్మ అమ్మవార్లను విశేష రీతిలో అలంకరణలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ధర్మకర్తల మండలి సభ్యులు వైకాపా నేతలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *