సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
అశ్వారావుపేట నియోజకవర్గంలోని రైతులు వరి పత్తి వేరుశనగ మిరప కూరగాయలు పంటలతో పాటు వర్జినియా పొగాకు సాగు చేస్తున్నారు. వర్షభావ పరిస్థితులు చీడపీడలు ఎదుర్కొని ఎలాగోలా పంట సాగు చేసిన రైతన్నకు మిచ్చాంగ్ తుఫాన్ రూపంలో సర్వం నీటిపాలు చేసి తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట కోసి పొలాల్లో ఉంచిన వరి పనలు వర్షానికి తడిసి నీటిలో ననిపోయాయి. అలాగే అశ్వారావుపేట మండల వ్యాప్తంగా సుమారు 800 ఎకరాల్లో వేరుశనగ పంట కాల పరిమితి పూర్తి కావడంతో పీకి చేలోనే అరబెట్టారు ఒక్కసారిగా వచ్చిన తుఫాన్ దెబ్బకు 48 గంటలుగా వర్షానికి నానిపోయి కాయలు ఊలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అశ్వారావుపేట నార్మవారిగూడెం కి చెందిన పాకనాటి నాగు అనే రైతుకు చెందిన మూడేకరాలు కాకర పందిరి,గుర్రాలచెరువు కు చెందిన మంగరాజు 2ఎకరల కాకర పందిరి పూర్తిగా నెలకొరిగి సర్వనాశనం అయ్యిందని ఒక్కోపందిరికి రెండు లక్షలు పెట్టుబడి అయ్యేందని కాపు కోతకు సిద్ధంగా ఉందని మొత్తం నాశనం అయ్యిందని పెట్టుబడితో సహా మొత్తం భూమిలో కలిసిపోయిందని చెబుతూ రైతులు కన్నీరు మున్నిరవుతున్నారు.తుఫాన్ దెబ్బకు రోడపై చెట్లు కులాయి. మారుతీ నగర్లొ చెట్టు పడి ఒక ఇల్లు కూలింది. నియొజవర్గ వ్యాప్తంగా అనేక ఇల్లు నీట మునిగాయి.. రాష్ట్రీయ రహదారిపై నుండి నీరు ప్రవహించింది.