బద్వేల్ లో డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

సిరా న్యూస్,బద్వేలు;

బద్వేలు పట్టణం లో నెల్లూరు రోడ్డు లో అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం అంబేద్కర్ 67 వ వర్థంతి వేడుక అంబేడ్కర్ భవన అభివృద్ది కమిటీ అధ్యక్షులు బండి జకరయ్య ఆధ్వర్యాన ముఖ్య అతిథులుగా బద్వేలు శాసన సభ్యులు డా.సుధ ఆహ్వానితులుగా ,సగర కర్పొరేషన్ రాష్ట్ర ఛేర్మెన్ జి.రమణమ్మ, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ గోపాలస్వామి యాదవ్,వైయస్సార్ సి.పి గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి జి.శ్రీనివాసులు,నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు,యస్.సి,యస్.టి మానిటరింగ్ కమిటి సభ్యులు సి.నారాయణ, వైయస్ఆర్ సి.పి జిల్లా కార్యదర్శి యద్దారెడ్డి పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నాగరాజు,మునిసిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి హాజరై విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా యం.యల్.ఎ డా.సుధ మాట్లాడుతూ ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేడ్కర్ 1891 ఏఫ్రిల్ 14 న మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో ఒక అస్పృశ్య మహర్ కుటుంబంలో పుట్టి కుల నిర్మూలనకు,సమసమాజ నిర్మాణానికి అవమానాల అగ్నిలో పదునెక్కిన వ్యక్తిత్వం గల కుల నిర్మూలన పోరాట యోధులు అంబేడ్కర్ అని అన్నారు.రాజ్యాంగంలో సర్వమానవులకూ సమాన హక్కులను కల్పించిన దార్శనికుడు,హిందూ కోడ్ బిల్లు ఆమోదించనందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించిన మహనీయులు అంబేడ్కర్ అని కొనియాడారు.ఆయన ఆశయాల సాధన అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు.అనంతరం ఫూలే ఆశయ సాధన సమితి ఛైర్మెన్ గురుమూర్తి కుల “నిర్మూలన పోరాట యోధులు అంబేడ్కర్ “పుస్తకాలను యం.యన్.ఎ చేతుల ద్వార పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రమణ,మాజీ కౌన్సిలర్ బాబు,వైయస్సార్ సి.పి నాయకులు పి.అనిల్ కుమార్, శిద్దమూర్తి జయరామి రెడ్డి,యన్.రాజశేఖర్, జి.ప్రతాప్ తిరుపాల్,సి.పి.ఐ నాయకులు వెంకటసుబ్బయ్య, బాలు యం.ఆర్.పి.యస్ రాష్ట్ర నాయకులు యన్.చెన్నయ్య, మాల మహానాడు రవి,ఫూలే అంబేడ్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకులు యం.పిచ్చయ్య, డి.హెచ్.పి.యస్ పి.వెంకటరమణ, లక్ష్మణ్ ,దళిత నాయకులు జె.టి చారి, యు.మునెయ్య,యస్.రోం, అనిల్,బి.సి సంఘ నాయకులు వెంకటరమణ యాదవ్, ఫూలే ఆశయ సాధన సమితి సభ్యులు రంగరాజు,డి.బి.యఫ్ రాష్ట్ర నాయకులు చిన్నయ్య ,డివైఎఫ్ఐ నాయకులు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *