అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం
సిరా న్యూస్,రంగారెడ్డి;
కూకట్పల్లి రైతు బజార్ వద్ద ఫుట్పాత్ ఆక్రమణలను జిహెచ్ఎంసి, ట్రాఫిక్ సిబ్బంది తొలగించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్కడికి చేరుకున్నారు. అధికారులను నిలదీసారు. కార్పొరేట్ సంస్థ అయిన లులు మల్ కి కొమ్ముకాస్తు అధికారులు ముందస్తు సమాచారం లేకుండా ఎలా తొలగిస్తారని అధికారులపై మండిపడ్డారు. ఫుట్ పాత్ పై చిరు వ్యాపారస్తులకి ఏదైనా ప్రత్యామ్నాయం చూపకుండా చిరు వ్యాపారులను రోడ్డున పడేసారు అని అధికారుల పై ఎంఎల్ఏ ఆగ్రహం వ్యక్తం చేసారు.