సిరా న్యూస్, బోథ్
సాంప్రదాయాన్ని మరవకుండా పండుగలను జరుపుకోవాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
రఘునాథ్ పూర్‌లో దసరా పండుగ వేడుకలు
బంజారా లు ప్రతి ఏటా వర్షాకాలానికి ముందు జరుపుకునే దసరా పండుగను మరవకుండా సాంప్రదాయబద్దంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని రఘునాథ్ పూర్ గ్రామంలో నిర్వహించిన పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సాంప్రదాయాలను మరవకుండా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నారు. పూర్వీకులు చూపించిన సాంప్రదాయాలను పాటించాలని కోరారు. కార్యక్రమంలో నేరడిగొండ ఎంపీపీ సజన్లాల్, బోథ్ మండల నాయకులు మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, ఆత్మ మాజీ చైర్మన్ సుభాష్ మల్లెపూల తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు