సిరా న్యూస్, జైనథ్,
బడీడు పిల్లలను సర్కార్ బడిలో చేర్పించండి : ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే
బడి ఈడు పిల్లలను సర్కార్ బడిలో చేర్పించాలని జిల్లా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే అన్నారు.
సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కాన్పమేడిగూడ రోడ్ గ్రామంలో బడి బాటలో భాగంగా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో “బేటి బాచావ్ -బేటి పడావ్”, “బాలికలను రక్షిద్దాం – బాలికలను చదివిద్దాం” అనే నినాదాలతో మేడిగూడ రోడ్ గ్రామంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే మాట్లాడుతూ బేటి బాచావ్ -బేటి పడావ్ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం నింపాలని అన్నారు. బాలికలలు జ్ఞాన చైతన్య దీపికలూ అని అన్నారు. బడి ఈడు పిల్లలు తప్పకుండా సర్కార్ బడిలో చేర్పించండి అని గ్రామస్తులనూ కోరారు. బాలికలను చిన్నప్పటి నుండి ఎలాంటి వివక్షతను చూపరాదని అన్నారు. మంచి చెడులను పిల్లలకు చెప్పాలనీ అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతోష్, పవన్, భావాని ఆనంద్, పెంటపర్తి ఊశన్న, విడిసి చైర్మన్ క్యాతం రాంరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా నాయకులు క్యాతం శివప్రసాద్ రెడ్డి, మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధులు కొటేష్,ని ఖీల్ అంగన్ వాడీ టీచర్స్ కళావతి ,స్వప్న, గంగాదేవి , గ్రామస్తులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.