సిరా న్యూస్, ఆదిలాబాద్
ఆదివాసీ మహిళకు రక్తదానం చేసిన పైశక్తి మహేందర్
* ఎమ్మెల్యే చొరవతో స్పందించిన యువకుడు
నిర్మల్ జిల్లాలోని కడెం మండలం కొత్త మైసంపేట్ గ్రామానికి చెందిన ఆదివాసి మహిళ ఆడ తురుపబాయి కి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చొరవతో అత్యవసర సమయంలో అడ గ్రామానికి చెందిన పైశక్తి మహేందర్ రక్తదానం చేసిన తన మానవత్వాన్ని చాటుకున్నారు. అంతకు ముందు రక్తహీనతతో బాధపడుతూ బాధిత మహిళ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చేరగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ను ఫోన్ ద్వారా సంప్రదించారు. మహిళలకు అవసరమైన బి పాజిటివ్ రక్తాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.దీంతో వెంటనే స్పందించిన సామ రూపేష్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని అడ గ్రామానికి చెందిన పైశక్తి మహేందర్ ను సంప్రదించి మహిళలకు అవసరమైన రక్తాన్ని అందించేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర సమయంలో మహిళకు కావలసిన రక్తాన్ని అందించడంతో సకాలంలో వైద్యులు ఆమెకు రక్తం ఎక్కించారు. దీంతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సామ రూపేష్ రెడ్డితో పాటు మహేందర్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో రూపేష్ రెడ్ది, మహేందర్ లతో పాటు ప్రశాంత్ తదితరులు ఉన్నారు.