సిరా న్యూస్ ఇంద్రవెల్లి..
ఆదివాసుల హక్కుల్ని పరిరక్షించాలి.. మెస్రందుర్గు
ఈనెల 13న నిర్వహిస్తున్న దళిత దెబ్బ ర్యాలీ ఆదివాసుల హక్కులకు భంగం కలిగేలా ఉందని తుడుం దెబ్బ అధ్యక్షుడు జుగ్నాక్ భరత్ అన్నారు. సోమవారం ఆయన ఇతర నాయకులతో కలిసి అమర వీరుల స్తూపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాటాలు చేసిన వీరుల ఆశయాలను కొనసాగించేలా ప్రతీ ఒక్కరు కంకణ బద్దులు కావాలన్నారు. ఆదివాసీల మనోభావాలను భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించిన సహించేది లేదని, పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గేడం భరత్, రాందాస్, మెస్రం భరత్, మడవి ఆనంద్ రావు, కుంట విట్టల్, ఆర్క వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.