సిరా న్యూస్,మేడ్చల్;
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో, ఒక ఇంట్లోకి చెరబడ్డ దొంగ, ఇల్లు గుల్ల చేసి పారిపోయేలోపే ఇంటి యజమానులు వచ్చేసారు. వారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో దొంగ పక్కనున్న చెరువులోకి దుంకాడు. సురారం పోలీసులు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని , దొంగని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. పోలీసులు ఎంత నచ్చ చెప్పిన బయటికి రాకుండా చెరువు మధ్యలో కూర్చున్నాడు. అతి కష్టం మీడ దొంగ ను బయటకు రప్పించారు.