సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
సోదర భావానికి ప్రతీకగా రక్షాబంధన్: బీజేపీ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్
* కాల్వ శ్రీరాంపూర్ పాఠశాలల్లో రక్షాబంధన్ వేడుకలు
సోదరభావానికి ప్రతీకగా భారతదేశం అంత జరుపుకునే రాఖీ పండుగ అని బీజేపీ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్ అన్నారు.శనివారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రంలోని వివిధ పాఠశాలల్లో బీజేపీ ఆధ్వర్యంలో రక్షబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనం దేశానికి ధర్మానికి రక్ష అని నినాదం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయి హరీష్, లింగమూర్తి, స్కూల్ ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్, శ్రీకాంత్, ప్రసాద్, చంద్రమౌళి తదితర ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.