సిరాన్యూస్, ఓదెల
పెరక రమేష్ కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత
విజ్జన్న యువసేన వ్యవస్థాపకులు అల్లం వినోద్ రెడ్డి
* జర్నలిస్ట్ రమేష్ అకాల మృతి పత్రికా రంగానికి తీరని లోటు
పెద్ద పల్లి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పెరక రమేష్ మృతి జర్నలిజానికి తీరని లోటని విజ్జన్న యువసేన వ్యవస్థాపకులు అల్లం వినోద్ రెడ్డి అన్నారు. సోమవారం వారి కుటుంబానికి అల్లం వినోద్ రెడ్డి 50 కిలోల బియ్యం వితరణ చేయగా బొడ్డుపల్లి శ్రీనివాస్, అహ్మద్ అందించారు. అలాగే పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ లు పోతని పురుషోత్తం, భూతగడ్డ సంపత్ లు నగదు ను అందించారు. ఈ కార్యక్రమం లో చంద్రగిరి రవి తదితరులు ఉన్నారు.