ఓఆర్ఆర్ పరిధిలోకి మరో 51 గ్రామాలు

 సిరా న్యూస్,హైదరాబాద్;
సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తక్షణమే ఈ గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానున్నట్టు అధికారులు తెలిపారు. 51 పంచాయతీల రికార్డులు.. మున్సిపల్ అధికారుల చేతుల్లోకి రానున్నాయి. డినోటిఫై చేస్తూ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.మేడ్చల్ మున్సిపాలిటీలోకి పూడూర్, రాయలపూర్ గ్రామాలు రానున్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి కీసర, యదగిర్ పల్లి, అంకిరెడ్డిపల్లి, చిర్యాల, నర్సంపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. పోచారం మున్సిపాలిటీలోకి బోగారం, గోధుమకుంట, కరీంగూడా, రాంపల్లి దయరా, వెంకటాపూర్, ప్రతాప సింగారం, కొర్రెముల, కాచవానిసింగారం, చౌదరిగూడ గ్రామాలు విలీనం కానున్నాయి.ఘట్కేసర్ మున్సిపాలిటీలోకి అంకుశపూర్, ఔషాపూర్, మందారం, ఎదులాబాద్, ఘనపూర్, మఱిప్యాల్ గూడ గ్రామాలు విలీనమవ్వనున్నాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి మునిరాబాద్, గౌడవెల్లి గ్రామాలు రానున్నాయి. తుంకుంట మున్సిపాలిటీలోకి బొంరాస్ పేట, శామిర్ పేట, బాబాగుడా గ్రామాలు రానున్నాయి. అమీన్‌పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, ఐలాపూర్ తండా, కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, దాయర, సుల్తాన్పూర్ గ్రామాలు అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోకి రానున్నాయి.ఇక.. పటాన్‌చెరు మండల పరిధిలోని పాటి, కర్ధనూరు, ఘనపూర్, పోచారం, ముత్తంగి గ్రామాలు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోకి విలీనం కానున్నాయి. మున్సిపల్ అధికారుల చేతుల్లోకి పంచాయతీల రికార్డులు వెళ్లనున్నాయి. డినోటిఫై చేస్తూ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
ఏఏ గ్రామాలు ఏ మున్సిపాలిటిలో విలీనమవుతున్నాయంటే..
పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో.. బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్‌ తారామతిపేట పంచాయతీలు విలీనం
శంషాబాద్ మున్సిపాలిటీలో.. బహదూర్‌గూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్ గూడ, ఘంసీమిగూడ విలీనం
నార్సింగి మున్సిపాలిటీలో.. మీర్జాగూడ గ్రామపంచాయతీ
తుక్కుగూడ మున్సిపాలిటీలో.. హర్షగూడ గ్రామపంచాయతీ
మేడ్చల్ మున్సిపాలిటీలో.. పూడూరు, రాయిలాపూర్ గ్రామపంచాయతీలు
దమ్మాయిగూడ మున్సిపాలిటీలో.. కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి
నాగారం మున్సిపాలిటీలో.. బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార గ్రామాలు
పోచారం మున్సిపాలిటీలో.. వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివానిసింగారం, చౌదరిగూడ విలీనం
ఘట్‌కేసర్‌ మున్సిపాల్టీలో.. అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ విలీనం
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో.. మునీరాబాద్, గౌడవెల్లి పంచాయతీలు
తూంకుంట మున్సిపాలిటీలో.. బొంరాసిపేట, శామీర్ పేట, బాబాగూడ పంచాయతీలు విలీనం
ఏడు జిల్లాల్లో సర్వే షురూ
ప్రస్తుతం హైడ్రా ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు ఉన్న చెరువులు, కుంటలు, ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌జోన్లు, నాలాలు, ప్రభుత్వ పార్కులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. హెచ్‌ఎండీఏలో పరిధిలో ఏడు జిల్లాలు ఉండగా.. ఆయా జిల్లాల్లోని చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కమిషనర్‌కు అప్పగించాలని చూస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఆక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు హైడ్రాతోపాటు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను కూడా రంగనాథ్‌కే అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతల అప్పగింతపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో చెరువుల సర్వే, ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ, నోటిఫికేషన్‌ పూర్తి చేయాలని ఇప్పటికే హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో చెరువులు ఉండగా.. ఆయా జిల్లాల కలెక్టర్లతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబరు 1 లోగా అన్ని చెరువుల సర్వేతో పాటు ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో మెుత్తం 3,500 చెరువులు ఉండగా…ఇప్పటివరకు 265 చెరువులను నోటిఫై చేసినట్లు చెప్పారు. కాగా, హైడ్రాతో పాటు చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు కూడా రంగనాథ్‌కే అప్పగించనున్నారనే సమాచారంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *