సిరాన్యూస్, చిగురుమామిడి
నవాబుపేటలో చిన్నారిపై కుక్కల దాడి
కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయలైన ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన కక్కెర్ల మేఘన, శ్రీనివాస్ దంపతుల నాలుగు సంవత్సరాల కూతురు శ్రీహన్సీ బుధవారం సాయంత్రం నాలుగ గంటల సమయంలో అంగన్వాడీ స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో చిన్నారిపై ఒక్కసారిగా పిచ్చి కుక్కలు దాడి చేసే తీవ్ర గాయపరిచాయి. చిన్నారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో పిచ్చికుక్కల బెడద తీవ్రంగా ఉందని, వాటిని కట్టడి చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలోని కుక్కల బెడద నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.