సిరా న్యూస్,ఖమ్మం;
నేలకొండపల్లి మండలం కట్టుకాచారం లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణా లోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వరదల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఆర్ధరాత్రి వచ్చిన వరదలతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గడిచిన100 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున వరదలు ఎప్పుడూ రాలేదు. వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనిఅన్నారు.
ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాకు వచ్చి వరదల వల్ల ఏర్పడిన పరిస్థితి చూసారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. వరదలను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలి. తెలంగాణ వ్యాప్తంగా 5438 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంచనా. కేంద్ర ప్రభుత్వం వెంటనే 2 వేల కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి లేఖ రాశారు. కేంద్రం ఆంద్రప్రదేశ్ కి ఏవిధంగా సాయం చేస్తుందో తెలంగాణాకి కూడా అలాగే చేయాలి. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎక్కడైనా తడిచిన ధాన్యం ఉంటే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు