సిరాన్యూస్, బోథ్
సొనాల వివేకానంద పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సొనాల వివేకానంద పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు రాధాకృష్ణన్ గొప్పతనాన్ని గురించి,విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర గురించి విద్యార్థులకు తెలియజేశారు. మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం.మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. అజ్ఞాన అందకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించి పిల్లల్లో క్రమశిక్షణ ,నైతిక విలువలు అందించే వారే గురువులు అని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య,ఇస్తారి,శుద్దోధన్, శ్రీధర్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.