సిరాన్యూస్, బోథ్
సొనాల జడ్పీఎస్ఎస్‌కు ఎలక్ట్రికల్ బెల్ అందజేత: అసిస్టెంట్ ప్రొఫెసర్ రాడాపు సంతోష్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సోనాల పాఠశాల సక్రమ నిర్వహణ, సమయం పాలన ప్రకారం విధులు నిర్వహించడానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల సొనాల యొక్క పూర్వ విద్యార్థి ,అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ రాడాపు సంతోష్ కుమార్ పాఠశాలకు ఎలక్ట్రిక్ బెల్ జడ్పీఎస్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అందజేశారు.ఈ సందర్బంగా వారికి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.