సిరాన్యూస్, ఇచ్చోడ
ఉపాధ్యాయుడు సామల రాజును సన్మానించిన సామాజిక వేత్త వీరనందయ్య
బజార్‌హత్నూర్ మండలంలోని గంగాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాద్యాయునిగా పని చేస్తున్న సామల రాజు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు సామల రాజును సోమవారం రాజ రాజేశ్వర విద్యాసంస్థల అధ్యాపక బృందం, సామాజిక వేత్త బొజ్జవార్ వీరనందయ్య ఘనంగా సన్మానించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మాట్లాడుతూ ఈ అవార్డు రావడంతో ఇంక నా బాధ్యత పెరిగింది అని అన్నారు. అలాగే బొజ్జావర్ వీరనందయ్య మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులకి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించు విద్యార్ధుల ఉన్నతికి పాటు పడుతున్న ఆధ్యాపకులను సన్మానించడం శుభ సంతోషం అని తెలిపారు.