సిరాన్యూస్, భీమదేవరపల్లి
వరద బాధితులకు ఆర్థిక సాయం చేద్దాం : తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
వరద బాధితులకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేద్దామని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ అన్నారు. సోమవారం భీమదేవరపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ వరదల కారణంగా ఇండ్లలోకి నీరు వచ్చి వందల కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయి, కొంతమంది చనిపోవడం జరిగిందన్నారు. వర్షాల కారణంగా ఇండ్లు నీటిలో మునిగాయని, ప్రజలు తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. మానవ సమాజం దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పార్టీలకు అతీతంగా అందరు కలిసి ప్రజలు ప్రభుత్వానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిత్యవసర సరుకులు బియ్యం ,దుప్పట్లు,చిన్నపిల్లలకు సంబంధించిన బట్టలు ఇవ్వడంలో మన వంతుగా వారికి తోడుగా ఉండాలని కోరారు. పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు వరద బాధితులకు చేయూతనివ్వాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.