సిరా న్యూస్,వాగాడు;
ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలి పాలెం లో సముద్రం తీరంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనానికి వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతు కాగా వారిలో ఇద్దరు యువకులను పోలీసులు కాపాడారు. మరో యువకుడు ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వ్యక్తి నాయుడుపేటకు చెందిన మునిరాజా గా పోలీసులు గుర్తించారు. నాయుడుపేట నుండి వచ్చి గణేష్ నిమజ్జనం చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన మరో ఇద్దరు యువకులను పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక బాలిరెడ్డి పాలెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గల్లంతయిన మునిరాజా కోసం మెరైన్ సిబ్బందితో కలిసి పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.