సిరా న్యూస్,మేడ్చల్;
శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముడిచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ గుడిలో అర్ధరాత్రి చోరీ జరిగింది. సుమారు 1,50,000 విలువగల బంగారం వెండి ఆభరణాలు చోరీ గురయ్యా అని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి ముక్కుపుడక, శతగోపం, పళ్లెం, కిరటాలు తదితర వస్తువులు చోరీ జరిగాయి. ఆలయానికి ఉన్న రెండు ప్రధాన ద్వారాలు తాళాలు విరగ్గొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు