సిరా న్యూస్,కొత్తగూడెం;
జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలకు వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రజక సంఘ నాయకులు ప్రదర్శనగా గ్రామంలోని ఐలమ్మ విగ్రహం వద్దకు తీసుకొని వెళ్తున్న క్రమంలో ఓ వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేను గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. దీంతో మరో వర్గం వారు ఎమ్మెల్యే ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి వస్తే గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకువెళ్లడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాలు వాగ్వివాదానికి దిగాయి, ఇరు వర్గాల మధ్య తోపులాట సైతం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే ఆ కార్యక్రమానికి రాకుండానే ఓవర్గం వారు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అప్పటికి ఇరువర్గాల మధ్య వాగ్వివాదం కొనసాగుతూనే ఉంటాడటతో ఎమ్మెల్యే కలగజేసుకొని నచ్చ చెప్పడంతో ఇరువర్గాలు శాంతించాయి..