సిరా న్యూస్,భద్రాచలం;
ఎగువన శ్రీరామ్ సాగర్ బ్యారేజి నుండి వదిలిన వరదనీరు దిగువకు విడుదల చేయడంతో భద్రాచలం దగ్గర గోదావరి లో నీటి మట్టం పెరిగింది. మంగళవారం సాయంత్రానికి 48 అడుగులకు చెరడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పట్టణంలో బ్యాక్ వాటర్ ను ఎప్పటికప్పుడు భారీ మోటార్ల ద్వారా స్లూయిజ్ ల వద్ద గోదావరి లోకి పంపింగ్ చేస్తున్నారు. వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ జితీశ్ వి పాటిల్ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజలు ఎవ్వరూ కూడా వాగులు,వంకలు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కి వెళ్లరాదని సూచించారు. చర్ల మండలం లోని తాలిపేరు ప్రాజెక్టు కు తగ్గిన వరద నీరు.ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి 40 వేల క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేశారు.
గోదావరి వరద 50 అడుగులకు చేరినట్లయితే భద్రాచలం నుండి దుమ్ముగూడెం చర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోతాయి.తురుబాక వద్ద గోదావరి ప్రధాన రహదారి పైకి వచ్చి చేరితే రాకపోకలు నిలిచిపోతాయి. ఆంధ్రా కూనవరం చింతూరు మండలాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. .
గణేష్ ఉత్సవాలు ముగుస్తున్న సందర్భంగా పూజలు అందుకున్న గణనాదులు భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనం కు తరలిరానున్న నేపథ్యంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని,మూడు లాంచీలు,ఆరు క్రేన్లు,గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు అని కలెక్టర్ తెలిపారు.