సిరాన్యూస్, ఓదెల
శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకున్న సినీ హాస్యనటుడు శివారెడ్డి
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని బుధవారం ప్రముఖ సినీ హాస్యనటులు శివారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆలయ సిబ్బంది శివారెడ్డికి స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం తెలంగాణ నేత్ర అవయవ, శరీర, దాతల సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మెరుగు భీష్మ చారి నేత సదాశయ ఫౌండేషన్ ద్వార చేస్తున్న సేవల గురించి తెలుసుకున్నసినీ హాస్యనటుడు శివారెడ్డి భీష్మ చారిని అభినందించారు. వీరి వెంట మెరుగు సారంగం, క్యా తం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, మల్లేశం, భాస్కర్ల శ్రీనివాస్, కనీకిరెడ్డి సురేష్ , పిట్టల నర్సింగం, సూత్రాల పోషాలు తదితరులు ఉన్నారు.
