సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
జాన్సన్ నాయక్ క్యాంప్ కార్యాలయంలో వినాయక నిమజ్జనం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భుక్యా జాన్సన్ నాయక్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని బుధవారం నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా గణనాధునికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కలగాలని గణనాధుడు మనందరికీ అష్టఐశ్వర్యాలు అయురారోగ్యలు ప్రసాదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.