సిరాన్యూస్, చిగురుమామిడి
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలి : ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిట్టంపల్లి శ్రీనివాస్
* తహసీల్దార్ రమేశ్‌కు వినతి పత్రం అందజేత
చిగురుమామిడి మండలంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని చిగురుమామిడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిట్టంపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రెస్ క్లబ్ సభ్యులు ఆధ్వర్యంలో తహసీల్దార్ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రిజిస్టర్ ప్రెస్ అధ్యక్షుడు చిట్టంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మండల జర్నలిస్టులకు కోసం గత ప్రభుత్వం మండలంలో ప్రభుత్వ స్థలం గతంలో కేటాయించారని తెలిపారు.కొన్ని అనివార్య కారణాలతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని,తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అదే స్థలాన్ని జర్నలిస్టులకు త్వరగా కేటాయించి తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బుర్ర పరుశరాములు,కొంకట బాలయ్య,చిట్టంపల్లి శ్రీనివాస్, ఎనగందుల రవీందర్, రాకం కరుణాకర్, పత్తెం రమేష్, తాళ్ల నరేష్, గుడికందుల దేవదాసు,వేల్పుల క్రాంతి కుమార్,బొల్లబత్తిని మహేష్,బోయిని సంపత్,ముంజ శ్రీకాంత్, అకుల రాజు, మారుపాక రమేష్, చంచల తిరుపతి, పిట్టల తిరుపతి,రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.